రాజమౌళి RRR కోసం రాసుకున్న కథ వెనక ఉన్నది ఆ హాలీవుడ్ సినిమా ??

-

‘బాహుబలి’ బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో దేశవ్యాప్తంగా తో పాటు అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్ రాజమౌళి పేరు మారుమ్రోగింది. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా రాజమౌళి పేరు మారుమ్రోగుతోంది. ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాపై దేశవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులకు మంచి ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది.

సినిమా ప్రారంభించిన మొదటిలో ఈ ఏడాది జూన్ నెలాఖరులో సినిమా రిలీజ్ అవుతుందని డేట్ ప్రకటించిన రాజమౌళి ఇటీవల జనవరి 8వ తారీకు వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అవుతున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాకి సంబంధించి స్టోరీ విషయంలో తాజాగా ఒక వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది.

 

అదేమిటంటే ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ వెనుకాల హాలీవుడ్ సినిమా స్టోరీలైన్ వున్నట్లు కామెంట్లు వినబడుతున్నాయి. మేటర్ లోకి వెళితే హాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన 300 యోధులు హాలీవుడ్ సినిమా టైపు ఈ సినిమా ఉంటుందని ఇందుమూలంగానే ఈ సినిమాలో తారక్ తోడేలు తో పోరాడే ఫైట్ ఉంటుందనే వార్తలు బలంగా వినపడుతున్నాయి. 

Read more RELATED
Recommended to you

Exit mobile version