RRR: రికార్డులు క్రియేట్ చేస్తున్న ట్రిపుల్ ఆర్…. బాహుబలి-2 రికార్డ్ బ్రేక్

-

ఆర్ఆర్ఆర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. విడులకు ముందు నుంచే ట్రిపుల్ ఆర్ కలెక్షన్ల దుమ్ము దులుపుతుందని ట్రేడ్ వర్గాలు అంచానా వేస్తున్నాయి. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కిన మూవీ కావడంతో సహజంగా అందరిలోను ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో మల్టీ స్టారర్ సినిమా కావడంతో మరింత హైప్ పెరిగింది. దాదాపుగా రూ. 400 కోట్ల పైగా బడ్జెట్ తో సినిమా తెరకెక్కింది. విడుదలకు ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మళయాళం, తమిళ భాషల్లో భారీగా కలెక్షన్లు రాబడుతోంది.

ఇదిలా ఉంటే తాజాగా ట్రిపుల్ ఆర్,  బాహుబలి-2 రికార్డ్ ను బీట్ చేసింది. తొలిరోజు కలెక్షన్లలో ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది. అమెరికా ప్రీమియర్స్ తో పాటు తొలిరోజు కలెక్షన్లు 5 మిలియన్ల మార్కును దాటేసింది. దీంతో అంతకుముందు ఉన్న బాహుబలి-2 రికార్డ్ ను బ్రేక్ చేసినట్లు అయింది. గతంలో బాహుబలి-2 మూవీ 4.5 మిలియన్లను రాబట్టింది. తాజాగా ఈ ఫిగర్ ను ట్రిపుల్ ఆర్ క్రాస్ చేసింది. ఇక ఏపీ, తెలంగాణలో ఒక్క రోజే రూ.70 కోట్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైం రికార్డ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version