ఆర్ఆర్ఆర్ సినిమా బీటెక్ అయిపోయినా వ‌స్త‌లేదు: ఫ్యాన్ ట్వీట్ వైర‌ల్

-

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో పాటు స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేష‌న్ లో వ‌స్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అనౌంన్స్ చేసి దాదాపు నాలుగు సంవ‌త్స‌రాలు అవుతుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ పై సోష‌ల్ మీడియా ల‌లో సెటైర్ లు పెలుతున్నాయి. తాజా గా ఈ సినిమా రిలిజ్ పై ఒక అభిమాని చేసిన ట్విట్ వైర‌ల్ అవుతుంది. ఈ ట్వీట్ లో నేను డిప్లామా లో ఉన్న‌ప్పుడు ఈ సినిమా ను స్టార్ చేశారు.. ఇప్పుడు బీటెక్ అయిపోయింది. అయినా.. ఈ సినిమా రిలిజ్ కాలేదు. అని ట్వీట్ చేశారు.

కాగ ఈ అభిమాని చేసిన ట్వీట్ ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారింది. చాలా మంది ఈ ట్వీట్ షేర్ చేస్తున్నారు. అయితే ఈ ట్వీట్ కు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం రీప్లే ఇచ్చింది. ఎం చేద్దాం మ‌రి నువ్వు కాలేజీ కి వెళ్ల‌న‌న్ని రోజులు కూడా మేము షూటింగ్ చేయ‌లేదు అని ఆర్ఆర్ఆర్ టీం స‌మాధానం ఇచ్చింది. కాగ ఆర్ఆర్ఆర్ సినిమా ను ప్రారంభిస్తున్న‌ట్టు 2017 లో ప్ర‌క‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా విడుద‌ల కాలేదు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7 ఆర్ఆర్ఆర్ సినిమా ను విడుద‌ల చేయాల‌ని చిత్ర బృందం భావిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version