తిరుమల వరదల పై మెగాస్టార్ ఎమోషనల్…ప్రభుత్వానికి రిక్వెస్ట్…!

-

ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలో, తిరుమల తిరపతిలో అయితే కుండపోత వర్షాలు పడుతున్నాయి. తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరగిపడ్డాయి. అంతే కాకుండా తిరుపతి లోని పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. వర్షాలతో ఏర్పడిన పరిస్థితులపై తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. కుండ పోత వర్షాలతో స్థానికులు పడుతున్న ఇబ్బందులు కలచి వేస్తున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఎన్నడూ లేని విధంగా కురుస్తున్న భారీ వర్షాలతో స్థానికులు, భక్తులు ఎదురుకుంటున్న ఇబ్బందులు బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు టిటిడి కలిసి కట్టుగా పనిచేసి సాధారణ పరిస్థితులు నెలకొనేలా కృషి చేయాలని పేర్కొన్నారు. అన్ని రాజీయపక్షాలు మరియు అభిమాన సంఘాలు బాధితులకు సాయం చేయాలని చిరంజీవి కోరారు. ఇదిలా ఉండగా తిరుమల తిరుపతి లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటికే ఘాట్ రోడ్డు మూసివేశారు. రాష్ట్రం లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కలెక్టర్ లకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version