ఆర్ఆర్ఆర్ కు ముందు జాగ్ర‌త్త‌లు..ముళ్ల కంచెలే శ‌ర‌ణ్య‌మా !

-

ప్రపంచ వ్యాప్తంగా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మచ్ అవెయిటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ట్రిపుల్ ఆర్ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా చేస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ట్రిపుల్ ఆర్ టీం దేశవ్యాప్తం భారీగా సినిమా ప్రమోషన్లు చేస్తోంది. ఇటీవల కర్ణాటక చిక్ బల్లాపూర్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ ఎత్తున ప్రేక్షకులు వచ్చారు. మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ‘ ఆర్ఆర్ఆర్’ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్యాన్ ఇండియా సినిమాగా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లో ట్రిపుల్ ఆర్ రిలీజ్ కాబోతోంది. 

ఇదిలా ఉంటే …. ట్రిపుల్ ఆర్ సినిమాకు ముందు థియేటర్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఓ వైపు రాజమౌళి, మరోవైపు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇలా కాస్ట్ అండ్ క్రూ ఉండటంతో ఫ్యాన్స్ కు ఇక పండగే. అందుకే అభిమానులను అడ్డుకునేందుకు కొన్ని థియేట్లర్లు తెర ముందర ఫెన్సింగ్ లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ అభిమానం నుంచి తమ థియేటర్లను రక్షించుకనే పని చేస్తున్నాయి యాజమాన్యాలు. మెగా పవర్ స్టార్, యంగ్ టైగర్ అభిమానులు ఈ సినిమా కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అభిమానం హద్దులు దాటితే తమ థియేటర్లకే ప్రమాదం అనుకున్నారేమో… ముందు జాగ్రత్తగా సిల్వర్ స్క్రీన్ల ను రక్షించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇవన్నీ చూస్తుంటే దేశ వ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ మానియా ఏవిధంగా ఉందో అర్థం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version