105 ఎమ్మెల్యే స్థానాల‌ను గెలిచి తీరుతాం : సీఎం కేసీఆర్

-

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ రాష్ట్రంలో 95 నుంచి 105 ఎమ్మెల్యే స్థానాల‌ను గెలిచి తీరుతామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ధీమా వ్య‌క్తం చేశారు. మూడు వేర్వేరు సంస్థ‌లు ఇప్ప‌టికే 30 స్థానాల్లో స‌ర్వే చేశాయ‌ని అన్నారు. 30 ఎమ్మెల్యే స్థానాల్లో 29 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంద‌ని తెలింద‌ని అన్నారు. మిగితా ఒక స్థానంలో కూడా 0.3 శాతం ఓట్ల‌తో ఓడిపోతుంద‌ని స‌ర్వేలో తెలింద‌ని తెలిపారు. అలా చూస్తే… రాష్ట్రంలో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 95 నుంచి 105 వ‌ర‌కు ఎమ్మెల్యే స్థానాల్లో గెలుస్తామ‌ని తెలిపారు.

కాగ ఈ సారి ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లే ప్ర‌సక్తే లేద‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో చేయాల్సిన ప‌నులు చాలా ఉన్నాయ‌ని అన్నారు. అభివృద్ధి ప‌థ‌కాల‌ను అమలు చేయాల్సి ఉంద‌ని తెలిపారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆరూ నూరైనా.. ముంద‌స్తు ఎన్నిక‌ల ముచ్చ‌టనే లేద‌ని తెల్చి చెప్పారు. 2018 లో అప్ప‌టి ప‌రిస్థితులు వేరు అని అన్నారు. అందుకే… అప్పుడు ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లాల్సి వ‌చ్చింద‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version