RRR : ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రివ్యూ.. రాజమౌళికి సెల్యూట్ కొట్టాల్సిందే.. చరణ్, తారక్‌ల మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్..

-

ప్రపంచంలోని సినీ ప్రియులందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానే వచ్చేసింది. అగ్రరాజ్యం అమెరికాలో ఒక రోజు ముందే ప్రీమియర్ షోలు వేయగా, మన దేశంలో రిలీజ్ డే ఎర్లీ మార్నింగ్ హవర్స్‌లో బెన్ ఫిట్ షోలు వేశారు. ఈ చిత్ర విడుదల చాలా సార్లు పోస్ట్ పోన్ అయింది. కాగా, ఎట్టకేలకు విడుదల అయింది. దాంతో మెగా, నందమూరి అభిమానులు సంతోషపడిపోతున్నారు. ప్రతీ భారతీయ సినీ ప్రేక్షకుడు ఈ సినిమా చూసి గర్వపడుతాడని అభిమానులు అంటున్నారు. ఇంతకీ పిక్చర్ ఎలా ఉంది? స్టోరి ఏంటి? ప్రేక్షకుడిని ఎటువంటి అనుభూతిలోకి రాజమౌళి తీసుకెళ్లాడు? అనే విషయాలు తెలుసుకుందాం.

‘ఆర్ఆర్ఆర్’ స్టోరి విషయానికొస్తే..1920ల కాలంలో భారత దేశాన్ని బ్రిటీష్ వారు పాలిస్తున్న కాలంలో సినిమా స్టార్ట్ అవుతుంది. రామరాజు అనే పాత్రను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోషించాడు. పోలీస్ ఆఫీసర్‌గా రగ్డ్ అండ్ రూత్ లెస్ లుక్‌లో ఉన్న చరణ్‌‌ను చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే వస్తాయి. ఇక భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌ను చూస్తే కూడా ప్రేక్షకుటు ఇట్టే కనెక్ట్ అవుతారు. ఈ క్రమంలోనే భారత దేశ స్వాతంత్ర్యం, ప్రజల కోసం ఢిల్లీలోని బ్రిటీష్ సర్కారుపైన భీమ్ (జూనియర్ ఎన్టీఆర్) దాడికి దిగుతాడు. బ్రిటీష్ పాలనకు ఎదురు తిరిగిన నేపథ్యంలో భీమ్‌ను పట్టుకునేందుకు గాను రామరాజును బ్రిటీష్ సర్కారు వారు ప్రత్యేక పోలీసు అధికారిగా నియమిస్తారు.

ఇక చిత్రంలో ఎదురయ్యే ట్విస్ట్‌లు ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయి. భీమ్‌ను పట్టుకునేందుకే రామరాజు అతనితో స్నేహం చేశాడా? భీమ్- రామరాజుల మధ్య స్నేహం ఎలా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది? భీమ్‌కు సాయం చేసినందుకుగాను రామరాజు ఎటువంటి శిక్షను ఎదుర్కొన్నాడు? వీరిరువురి మధ్య ఫ్రెండ్ షిప్‌నుకు సీత(ఆలియా భట్)ఎలాంటి పాత్ర పోషిస్తుంది? అనేది ఆసక్తికరంగా సాగింది. ఇక స్టోరిలో అజయ్ దేవగణ్, శ్రియ పాత్రలు కూడా కీలకంగా నిలిచాయి. చివరకు రామ్, భీమ్ ఇద్దరూ కలిసి బ్రిటీష్ సర్కారును ఎలా ఎదుర్కొన్నారనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

సినిమా చూస్తున్నంత సేపు ప్రతీ ఒక్క సినీ ప్రేక్షకుడు, అభిమాని రాజమౌళి టేకింగ్ కు ఫిదా కావాల్సిందే అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫస్టాఫ్ ఎమోషనల్ సీక్వెన్స్‌తో స్టార్ట్ అవుతుంది. గిరిజన బాలికను బ్రిటీష్ వారు ఎత్తుకెళ్లిన సీన్‌తో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ బాలికను రక్షించే ఎపిసోడ్ హైలైట్‌గా నిలుస్తుంది. కథ పరంగా బ్రిటీష్ సర్కారుకు అనుకూలంగా పని చేసే పోలీస్ ఆఫీసర్ గా రామ్ చరణ్ హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఆదిలాబాద్ అడవుల్లో ఎన్టీఆర్ జూనియర్ యాక్షన్ ఎపిసోడ్ మరో హైలైట్‌గా ఉంటుంది. పులితో తారక్ ఫైట్ పట్ల దర్శకుడు రాజమౌళి తీసుకున్న శ్రద్ధ వెండితెరపైన స్పష్టంగా కనబడుతుంది.

మాస్టర్ స్టోరి టెల్లర్ గా పేరు గాంచిన రాజమౌళి కథ, కథనం పట్ల మునుపటి సినిమాల కంటే చాలా జాగ్రత్త వహించారని చెప్పొచ్చు. పిక్చర్‌లో ప్రతీ ఒక్క పాత్ర ఎంట్రీ ఇస్తున్న కొద్దీ కథ ఇంకా ఎమోషనల్ అవుతుండటం చూస్తుంటే ప్రేక్షకుడు అట్టే సీటులో కూర్చుండిపోతాడు. భావోద్వేగాల పట్ల ఇంకా కాన్సంట్రేట్ అవుతుంటాడు. రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న సీన్స్, ఎలివేషన్స్ చిత్రీకరించిన అత్యద్భుతంగా ఉంది.

చెర్రీ, తారక్ ల పర్ఫార్మెన్స్ వాళ్ల కెరీర్‌లోనే ది బెస్ట్. కాగా, ఇతర పాత్రలు కూడా కీలకంగా ఉన్నాయి. సాంకేతిక విభాగాల పనితీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం.కీరవాణి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ చిత్రాన్ని నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లాయి. ఇంటర్వల్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్- రామ్ చరణ్ తేజ్ మధ్య ఉన్న ఫైట్ సీక్వెన్స్‌లను చూస్తుంటే ప్రతీ ఒక్క సినీ ప్రేక్షకుడు భావోద్వేగంలోకి వెళ్లిపోవడమే కాదు.. కంట తడి పెట్టుకుంటాడు. బాక్సాఫీసు రికార్డులన్నిటినీ ఈ ఫిల్మ్ తిరగ రాస్తుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య సినిమా కోసం పెట్టిన ఖర్చు వెండితెరపైన కనబడుతుంది. సినిమా నిర్మాణంలో ఆయన ఇచ్చిన సహకారం మూవీ యూనిట్ సభ్యులకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చిందని చెప్పొచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version