దళితులకు కేసీఆర్‌ శుభవార్త… దళిత బంధు పథకం కోసం రూ.17,700 కోట్లు

-

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీజేపీ సభ్యులు పాల్గొన్నారు. ఇక అసెంబ్లీ ప్రారంభం కాగానే.. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు 2022-23 బడ్జెట్‌ ను ప్రవేశ పెట్టారు. రూ.2 లక్షల 56 వేల 958 కోట్ల 51 లక్షలతో 2022 -23 తెలంగాణ బడ్జెట్‌ ను మంత్రి హరీష్‌ రావు ప్రవేశ పెట్టారు. అయితే.. ఈ బడ్జెట్‌ లో.. దళితులకు శుభవార్త చెప్పింది కేసీఆర్‌ ప్రభుత్వం. దళిత బంధు కోసం ఏకంగా… రూ.17,700 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి హరీష్‌ రావు ప్రకటన చేశారు.

దీంతో లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని మంత్రి హరీష్‌ రావు ప్రకటన చేశారు. ఇది ఇలా ఉండగా… హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన తర్వాత ఈటెల రాజేందర్ తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. హాజరైన కొద్ది సేపటికే సభ నుంచి సస్పెండ్ అయ్యారు. అంతకు ముందు అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు బీజేపీ ఎమ్మెల్యేలు.. సమస్యలను ప్రశ్నిస్తే మైకులు కట్ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. సభ ప్రారంభం అయిన అరగంటలోపే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version