సిర్పూర్ నుంచి పోటీ చేస్తా : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

-

వికారాబాద్ జిల్లా తాండూర్ బీఎస్పీ కార్యాలయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పాలమూరు… రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాన్ని సీఎం నేడు ప్రారంభించారని, ప్రతిపక్షాల గొంతు నొక్కి వారిని అరెస్టు చేసి కార్యక్రమం చేపట్టారన్నారు. 35 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టు ప్రారంభించి 55 వేల కోట్లకు అంచనాలను పెంచారని, ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు నష్టపరిహారం ఇంతవరకు చెల్లించలేదు, వారిని కూడా అరెస్టు చేసి కార్యక్రమం చేపట్టారన్నా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌.

అంతేకాకుండా.. ‘కెసిఆర్ ఫామ్ హౌస్ కు నీళ్లు తేవడం కోసం తుమ్మిడి హెడ్ నుంచి మేడిగడ్డ మీదుగా కొండపోచమ్మ రిజర్వాయర్కు సాగర్ నీళ్లు తెచ్చారు. దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు. ఇంకా 6 రిజర్వాయర్లు పూర్తికాకముందే కేవలం ఒక్క నార్లపుర్ దగ్గర ప్రారంభోత్సవం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల కార్మికులు సమ్మె చేస్తున్నారు. 26 సంవత్సరాలు నా ఉద్యోగ జీవితంలో పోలీసులు ఎప్పుడు ధర్నా చేసింది చూడలేదు. జీతాలు రాలేదని హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దాకా టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ దిగజార్చాడు. రాబోయే ఎన్నికల్లో పొత్తులు లేకుండా ఒంటరిగా బి ఎస్ పి పార్టీ పోటీ చేస్తుంది.
సిర్పూర్ నుంచి పోటీ చేస్తా… ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సిఐ రాజేందర్ రెడ్డిని ఘోరంగా తిట్టిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. తాండూరులో పరిశ్రమలు ఉన్న స్థానికలకు ఉద్యోగ అవకాశాలు లేవు. తాండూర్ డ్రగ్స్ కంపు గా మారింది. గజ్వేల్ లో అవసరం లేకున్నానే రింగ్ రోడ్డు వేస్తున్నారు.. కేవలం సీఎం కు సంబంధించిన భూముల ధరలు పెరగడం కోసమే. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడానికి కోట్ల రూపాయల డబ్బులు లంచంగా తీసుకుంటున్నారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి సమయం వచ్చినప్పుడు బయట పెడతాను. గ్రూప్ వన్ లో భారీగా అవకతవకలు జరిగాయి. చైర్మన్, కోడ్ నెంబర్లు ,హరీష్ రావు కవిత కేటీఆర్ ముఖ్యమంత్రి ఫోన్ సంభాషణను బయటపెట్టాలి.’ అని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version