రేవంత్ రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్

-

సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గురుకులాలు మొదటి నుంచి సమీకృతమే అని, అది రేవంత్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరం అని అన్నారు. గురుకులాల్లో ఒక్కటే కులం ఉండదు.అన్ని కులాల విద్యార్థులు చదువుకుంటారు.ఈ విషయం తెలియక ఒక్కటే కులం అని రేవంత్ రెడ్డి మాటిమాటికీ కేసీఆర్‌ను తిడుతున్నాడు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌంటర్ ఇచ్చారు.

అంతకుముందు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆర్ఎస్పీ మీద విరుచుకపడ్డారు. ‘మా ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్‌కు ఏమైందో అర్ధం కావడం లేదు. ప్రవీణ్ కుమార్ అంటే నాకు గౌరవం. ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నాకు అభ్యంతరం లేదు. ఏ దొరలు పేదలకు విద్య, వైద్యం దూరం చేశారో.. ఆ దొరల పక్కన చేరి బలహీన వర్గాలకు మంచి చేస్తే ఎందుకు విమర్శిస్తున్నారు?. కేసీఆర్ చెప్పినట్లు ఎస్సీ,ఎస్టీ,బీసీలు.. గొర్రెలు,బర్రెలు కాసుకుని బతకాలా? అని ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో కుత,మతాలకతీతంగా చదువు చెప్పిస్తామని సీఎం వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version