8న బీఎస్పీ పార్టీ లో చేరుతున్నట్లు మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఇవాళ ఆయన మీడియా తో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కావాలనో, మంత్రి కావాలనో బీఎస్పీ పార్టీ లో చేరడం లేదని.. ప్రజలకు మరింత సహాయం చేయాలనే ఉద్దేశం తో చేరుతున్నట్లు పేర్కొన్నారు. గులాబీ తెలంగాణ పోయి.. నీలి తెలంగాణ కావాలని పేర్కొన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.
నల్లగొండ జిల్లాలో జరిగే సభను సకెస్స్ చేయాలని పిలుపునిచ్చారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. తన రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే మొదలు కానున్నట్లు పేర్కొన్నారు. అలాగే మ్యాన్ హోల్ ఘటనపై కూడా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగానే ఇద్దరి ప్రాణాలు పోయాయని.. పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు అంటే ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. పేదవారికి ఒక న్యాయం ఉన్న వాళ్ళకి ఒక న్యాయమా ? అని ప్రశ్నించారు. చనిపోయిన శివ, అంతయ్య కుటుంబాలకు 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని.. దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.