జోగి రమేష్ ఎపిసోడ్ పై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు రియాక్ట్ అయ్యారు. గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణకు జోగి రమేష్ వస్తాడని అనుకోలేదని వెల్లడించారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. అతనితో ఉన్నంత సేపు ఇబ్బందిగా ఫీలయ్యామని… పార్టీకి ద్రోహం చేసే పని ఎప్పుడు చేయనని పేర్కొన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. జోగి రమేష్ మాకు రాజకీయ ప్రత్యర్ధి అన్నారు.
జోగి వస్తున్నాడని తెలిస్తే ప్రత్యామ్నాయం చేసే వాళ్ళమని… విగ్రహ ఆవిష్కరణ రసాభాస కాకూడదు అని అక్కడ ఏం మాట్లాడలేదని వెల్లడించారు. ఆహ్వాన కమిటీ వారు మాకు జోగి వస్తాడని చెప్పలేదన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు. దీనిపై చంద్రబాబును కలిసి వివరంగా చెబుతానని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో దీనిలో అవగాహన లేకుండా పోస్టులు పెట్టడం బాధ కలిగిస్తోందని వివరించారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు.