ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మనకు తెలిసిన లాక్ డౌన్ ఏ విధంగా ఉంటుంది…? జనాలు బయటకు రాకుండా కట్టడి చేయడమే లాక్ డౌన్. అత్యవసర సర్వీసులు, నిత్యావసరాలు మినహా ఏ ఒక్కటి కూడా అందుబాటులో ఉండే అవకాశం లేదు. అయితే ఒక జైల్లో మాత్రం లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. అది మన దేశంలో కాదు. ఎల్ సాల్విడార్ అనే దేశంలో. జైల్లో లాక్ డౌన్ ఎందుకు అంటారా…?
ఏమీ లేదు… ఆ దేశ జైల్లో ఒకే రోజు 22 మందిని చంపేశారు. దీనితో ఆ దేశ అధ్యక్షుడు నయీబ్ బ్యూక్‌లే, ఇజాల్కోలోని జైల్లో 24 గంటల లాక్‌డౌన్‌ను అమలు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. ఆ జైల్లో ముఠా నాయకులు శిక్షలు అనుభవిస్తున్నారు. వారి ఆదేశాలు, వ్యూహాల ప్రకారమే బయట నగరంలో హత్యలు జరుగుతున్నాయని దేశ అధ్యక్షుడు భావిస్తున్నారు. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
జైల్లోని ఖైదీలెవరూ ఒకరికొకరు మాట్లాడకుండాఉండాలి. వారు అందరిని ఒకే చోట బంధిస్తారు అధికారులు. ఇక ఆ దేశంలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో లాక్ డౌన్ ని అమలు చేస్తున్నారు. ఇక ఖైదీలకు ఊపిరి ఆడకుండా ఉంచుతారు. వాళ్ళు ఎవరిని కలవడానికి కూడా కుదరదు. దేశ వ్యాప్తంగా కరోనా ఉన్న సమయంలో అందరిని ఒకే చోట బంధించడం భావ్యం కాదని అంటున్నారు.