ప్రజలు కరోనాతోనే జీవించే పరిస్థితి ఉందని, గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్ల లాంటి మంచి వ్యవస్థ ఉందని ఆయన ధీమా వ్యక్తం చేసారు. ప్రజలు కరోనా గురించి అనవసరంగా భయపడవద్దు అని అన్నారు. ఇన్ని కష్టాలు ఉన్నా సరే పెంచిన పెన్షన్ లు ఇస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా నయం అయ్యే జ్వరం అని, కరోనా నాతో సహా ఎవరికి అయినా రావొచ్చు అని ఆయన అనడం గమనార్హం.
కరోనా వచ్చిన వాళ్ళను అంటరాని వాళ్ళగా చూడవద్దని ఆయన సూచించారు. కరోనా వచ్చిన వాళ్లకు ప్రేమ పంచాలని అన్నారు జగన్. ఎక్కువగా మందులు వేసుకుంటే తగ్గిపోతుందని చెప్పారు. కరోనా అనవసర భయాలకు ప్రజలు దూరంగా ఉండాలని, కరోనా రాకుండా జాగ్రతగా ఉండాలని కరోనాకు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇంట్లోనే తగ్గిపోతుందని జగన్ ప్రజలకు సూచించారు.
రోగ నిరోధక శక్తి పెంచుకుంటే కరోనా మన దగ్గరకు రాదని అది మనను ఏమీ చేయలేదు అని జగన్ ప్రజలకు సూచించారు. ప్రజలు అనవసర భయాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ప్రతీ ఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని, కరోనా మరణాల్లో ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కరోనా వస్తే జీవితం నాశనం అయినట్టుగా చూడవద్దు అని సూచించారు.
70 శాతం టెస్ట్ లు అన్నీ కూడా నెగటివ్ వస్తున్నాయన్న జ్వరం త్వరలో మరిన్ని టెస్ట్ లు చేస్తామని చెప్పుకొచ్చారు. కరోనా ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలుసుకోవడం చాలా కష్టమన్నారు. కరోనా బాధితుల్లో 4 శాతం మందికి మాత్రమే ఐసియు చికిత్స చేస్తున్నామని, గ్రీన్ జోన్స్ లో సాధారణ పరిస్థితులు ఉండాలని చెప్పారు. గ్రీన్ జోన్ లో కరోనా రాకుండా ఉండటానికి గానూ చర్యలు తీసుకోవాలని కోరారు.