ర‌ష్యాలో రాజ్‌నాథ్ : పాక్ కి షాక్.. చైనా కి షేక్..!

-

భారత దాయాది దేశమైన పాకిస్థాన్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఈ సారి దెబ్బకొట్టింది ర‌ష్యా.. అది కూడా ఆయుధాల విషయంలో.. రష్యా పర్యటనలో భాగంగా ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఇవాళ ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రి జ‌న‌ర‌ల్ సెర్గీ షోయిగితో భేటీ అయ్యారు. ఈ నేప‌థ్యంలో పాక్‌కు ఆయుధాలు సరఫరా చేయమని ర‌ష్యా స్ప‌ష్టం చేసింది. అయితే భార‌త్‌కు ఆయుధాలు స‌ర‌ఫ‌రా చేస్తున్న దేశాల్లో ర‌ష్యా మొదటి స్థానంలో ఉంది. ఇక ఏకే203 త‌రహా రైఫిల్స్ త‌యారీకి ఇరుదేశాలు కూడా అంగీకరించాయి.

అలాగే మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సుకు కూడా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీ చైనాకు ధీటుగా జవాబిస్తున్న క్రమంలో చైనా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయ్యేందుకు ఆసక్తి చూపించారు. ఈ భేటీకి రాజ్‌నాథ్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ హాట్ టాపిక్‌గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version