ఉక్రెయిన్- రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన భారతీయులను యుద్ధప్రాతిపదికన స్వదేశానికి తరలిస్తున్నారు. ‘ ఆపరేషన్ గంగా’ ద్వారా భారతీయ విద్యార్థులను ఏయిర్ లిఫ్ట్ చేస్తోంది భారత ప్రభుత్వం. ఇప్పటికే దాదాపు 17 వేల మంది భారతీయులు ఉక్రెయిన్ బార్డర్ దాటినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఏయిర్ ఫోర్స్ కూడా పాలుపంచుకుంటోంది. సీ-17 విమానం ద్వారా ఈరోజు ఢిల్లీకి భారతీయులను తరలించారు.
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ నుంచి వస్తున్న విద్యార్థులు పెంపుడు జంతువులను కూడా తీసుకువస్తున్నారు. అక్కడే యుద్ధ క్షేత్రంలో వదల లేక వాటిని తమ వెంట తీసుకువస్తున్నారు. ‘నేను ఉక్రెయిన్ నుండి నా స్నేహితుడి కుక్కను నాతో తీసుకువచ్చాను. కుక్కలను కలిగి ఉన్న చాలా మంది వాటిని ఉక్రెయిన్‌లో విడిచిపెట్టారు, కాని నేను నాతో పాటు ఈ కుక్కను తిరిగి తీసుకువచ్చాను అని జాహిద్ అనే విద్యార్థి అన్నారు.