సబితా వారసుడుకు సీటు కష్టాలు..ఈ సారి ఛాన్స్ ఉందా?

-

వచ్చే ఎన్నికల్లో చాలామంది సీనియర్ నేతలు తమ వారసులని ఎన్నికల బరిలో దించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ నేతలంతా తమ పార్టీ అధిష్టానాలని ఒప్పించి తనయులకు సీట్లు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సైతం తన వారసుడుకు సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. అనేక ఏళ్ళు కాంగ్రెస్ లో పనిచేసి, ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన సబితా గత ఎన్నికల్లో మహేశ్వరం నుంచి గెలిచి ఆ తర్వాత బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్ళిన విషయం తెలిసిందే.

తన తనయుడు కార్తీక్ రెడ్డిని సైతం పార్టీలోకి తీసుకెళ్లారు. అయితే బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్ళాక కార్తీక్ రెడ్డికి చేవెళ్ళ ఎంపీ సీటు దక్కుతుందని అనుకున్నారు. అందుకే కరెక్ట్ గా పార్లమెంట్ ఎన్నికల ముందు సబితా తన తనయుడుతో కలిసి బి‌ఆర్‌ఎస్ లోకి వెళ్లారు. అయితే కార్తీక్ రెడ్డికి సీటు దక్కలేదు. చేవెళ్ళలో బి‌ఆర్‌ఎస్ నుంచి రంజిత్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీ చేశారు. కేవలం 1300 ఓట్ల తేడాతో రంజిత్ విజయం సాధించారు.

ఇక వచ్చే ఎన్నికల్లో రంజిత్..రాజేంద్రనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని టాక్ వస్తుంది. అయితే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారు. ఇటు కార్తీక్ ఏమో చేవెళ్ళ ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారు. ఇలా చేవెళ్ళ ఎంపీ సీటు లో కన్ఫ్యూజన్ ఉంది. ఇక గత ఎన్నికల్లో ఓటమి పాలైన విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ వదిలి..బి‌జే‌పిలోకి వెళ్లారు.

దీంతో కొండా బి‌జే‌పి నుంచి పోటీ చేయడం ఖాయమే…ఇక కాంగ్రెస్ అభ్యర్ధిపై క్లారిటీ లేదు. ఇటు బి‌ఆర్‌ఎస్ నుంచి కార్తీక్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారా? లేక రంజిత్ రెడ్డినే మళ్ళీ బరిలో దింపుతారేమో చూడాలి. అయితే చేవెళ్ల పరిధిలో సబితా ఫ్యామిలీకి పట్టు ఉంది..మరి కార్తిక్ రెడ్డికి సీటు దక్కే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version