సచిన్ టెండుల్కర్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కన్నుమూత

-

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ కోచ్ రమాకాంత్ అచ్రేకర్ కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. ముంబైలోని తన నివాసంలో ఇవాళ సాయంత్రం రమాకాంత్ మృతి చెందినట్లు ఆయన ఫ్యామిలీ ప్రకటించింది. వృద్ధాప్యానికి సంబంధించిన సమస్యలతో గత కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉన్న ఆయన.. ఇవాళ తుది శ్వాస విడిచారు.

సచిన్ టెండుల్కర్‌తో పాటు వినోద్ కాంబ్లి, ప్రవిన్ అమ్రే, సమీర్ డిఘే, బల్విందర్ సింగ్ సంధు లాంటి క్రికెటర్లకు క్రికెట్ ఓనమాలు నేర్పించారు రమాకాంత్. ముఖ్యంగా సచిన్ టెండుల్కర్.. క్రికెట్ లెజెండ్‌గా మారడానికి రమాకాంతే కారణం. ఒక్క మాటలో చెప్పాలంటే రామాకాంత్ లేకపోతే.. దిగ్గజ క్రికెటర్ సచిన్ ఉండేవాడు కాదు. చిన్నప్పటి నుంచి రమాకాంత్.. సచిన్‌కు సరైన కోచింగ్ ఇవ్వడం వల్లే సచిన్ క్రికెట్ లెజెండ్ అయ్యాడు. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని లిఖించగలిగాడు. రమాకాంత్‌కు ద్రోణాచార్య అవార్డుతో పాటు దేశ అత్యుత్తమ పురస్కారమైన పద్మశ్రీ కూడా వరించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version