ప్రభుత్వ రంగ బ్యాంకులైన దేనా బ్యాంక్, విజయా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలను ఎస్బీఐలో విలీనానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలుపుతూ ఉత్తర్వూలు జారీ చేసింది. విలీన అంశాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు. ఈ మూడింటి విలీనం వల్ల ఏర్పడే కొత్త బ్యాంకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ తర్వాత దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించనుంది. విలీనం వల్ల ఆయాక బ్యాంకు ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం ఉండదని ఆయన తెలిపారు. దేశ, విదేశాల్లో కలిపి దానికి 9,485 శాఖలు ఏర్పడతాయి. ఏప్రిల్1, 2019 నుంచి ఈ విలీనం అమల్లోకి వస్తుంది.
ఇదిలా ఉంటే మూడు బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ గత నెల బ్యాంకు యూనియన్లు సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే. గతంలో కంటే ప్రస్తుత విలీనం తర్వాత పని భారం మరింత పెరగనుందని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.