సైకిల్‌కు సాయి శాపాలు..అప్పుడు గంటా వద్దు..ఇప్పుడు రివర్స్.!

-

తెలుగుదేశం పార్టీపై, చంద్రబాబు, లోకేష్‌లని ప్రతిరోజూ మీడియా సమావేశం పెట్టి తిట్టే వైసీపీ నాయకులు ఉన్నారు. వారు చేసే విమర్శలకు కౌంటర్లు ఇచ్చేవారు ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం బాబు, లోకేష్‌ని మాత్రం తీవ్రంగా దూషించేది మాత్రం విజయసాయిరెడ్డి ఒక్కరే. ఇక ఆయన ఏ బాష వాడుతారో అందరికీ తెలిసిందే. పరుష పదజాలంతో దారుణమైన లాంగ్వేజ్‌తో విరుచుకుపడతారు.

నిత్యం సోషల్ మీడియాలో అదే పనిలో ఉంటారు. తాజాగా కూడా విజయసాయి ఓ ట్వీట్ చేశారు. అది ఏంటంటే..  ఇంకో 6 నెలల్లో పచ్చ పార్టీ ముక్క చెక్కలవుతుందని, ఫ్యూచర్ కోరుకునే నేతలు ఇతర పార్టీల్లోకి వలస పోతారని,  బాబు మంత్ర దండం ‘తంత్ర’ శక్తిని కోల్పోయిందని, వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్ పవర్ సన్నగిల్లిందని,  ప్రజల్లో ఆదరణ లేదని, ఎలక్షన్లను ఎదుర్కొనే సామర్థ్యం లేదని క్యాడర్‌కు అర్థమైందని ట్వీట్ చేశారు.

అయితే వీటితో పాటు ఇంకా చాలా ట్వీట్లు చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ ట్వీట్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ట్వీట్ ప్రకారం చూస్తే ఆరు నెలల్లో టీడీపీ ముక్కలైపోతుందని సాయిరెడ్డి చెబుతున్నారు. మరి అదే జరిగే పనేనా అంటే..జరగని పని చెప్పవచ్చు. అంటే పార్టీలో ఉండే నేతలు జంప్ అయిపోతారు. ఇంకా పార్టీ మిగలదనే కోణంలో సాయిరెడ్డి చెబుతున్నారు.

అది కూడా ఇటీవల గంటా శ్రీనివాసరావు టీడీపీని వదిలి వైసీపీలో చేరతారనే ప్రచారం నేపథ్యంలోనే సాయిరెడ్డి ఈ ట్వీట్ చేసి ఉంటారు. అయితే గతంలో గంటా వైసీపీలోకి వస్తుంటే అడ్డుకుంది సాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్. అసలు గంటా లాంటి వారిని పార్టీలోకి రానివ్వమన్నట్లే చెప్పారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. గంటా పార్టీ మారితే టీడీపీ ముక్కలు అయిపోతుందని అంటున్నారు. అసలు గంటాని పార్టీ మారుతుంటే టీడీపీ శ్రేణులే లెక్క చేయడం లేదు. మరి ఇంకా ముక్కలు అనేది సాయిరెడ్డి శాపం అనుకోవచ్చు. ఆ శాపం ఫలిస్తుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version