బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ గురించి ఇప్పుడు ఒక వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.అయితే అది అవాస్తవం అని, అలాంటి వాటిని నమ్మవద్దు అని సైఫ్ అలీఖాన్ స్పష్టం చేసారు. ఇంతకీ ఆ వార్త ఏంటి? ఆ వార్తకి సైఫ్ అలీఖాన్ ఎందుకు వివరణ ఇచ్చారో అన్నా విషయాలు తెలుసుకుందాం.. !! సైఫ్ అలీఖాన్ కు కరీనా కపూర్ తో రెండో పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అయితే వీరి ఇద్దరికి కలిసి జన్మించిన మగ సంతానమే తైమూర్.
అయితే సైఫ్ అలీఖాన్ కు కరీనా కపూర్ కన్నా ముందే 1991లో నటి అమృతా సింగ్ తో వివాహం జరిగింది. అమృత, సైఫ్ లకు ఇబ్రహీం, సారా జన్మించారు. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2004లో అమృత, సైఫ్ విడిపోయారు. దీంతో సారా, ఇబ్రహీంలు తన తల్లి అమృత దగ్గరే ఉంటున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ గత కొద్దీ రోజుల నుంచి తన కుమార్తె సారాకి దూరంగా ఉంటున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి.ఇంకేముంది కూతురు, సారా అలీ ఖాన్ ను సైఫ్ దూరం పెడుతున్నాడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేసారు. సైఫ్ రెండో భార్య, ఆమె కుమారుడ తోనే ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటున్నాడని, మొదటి భార్య పిల్లలు, సారాను ఆమె సోదరుడిని పట్టించుకోవడంలేదని వార్తలు దుమారం లేపాయి.
తాజాగా ఈ కథనాలపై సైఫ్ స్పందించాడు. తన పై వస్తున్న వార్తలన్నీ అవాస్తమని కొట్టిపడేశాడు సైఫ్. ‘నేను ఎప్పటికీ నా పిల్లలతోనే ఉంటాను. నా ముగ్గురు పిల్లల మీద నాకెంతో ప్రేమ ఉంది. తైమూర్‌తో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాననే విషయం వాస్తవమే కానీ నా కూతురు సారా , ఇబ్రహీంతో తరచు ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను,నా ముగ్గురు పిల్లలకు నా హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పుకొచ్చాడు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ .