దాడి ఘటనలో సైఫ్ వాంగ్మూలం ఇచ్చారు…ఈ తరుణంలోనే వెలుగులోకి షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. దాడి ఘటనలో సైఫ్ వాంగ్మూలాన్ని నమోదు చేశారట పోలీసులు. ఇటీవల దుండగుడి దాడిలో గాయపడిన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారట. తాజాగా ఆయన పోలీసులకు ఈ దాడి వివరాలను వెల్లడిస్తూ వాంగ్మూలం ఇచ్చారు.
‘‘నేను, కరీనా మా గదిలో ఉన్నాం. సడెన్‌గా జెహ్ కేర్‌టేకర్ పెద్దగా అరవడంతో బయటకు వచ్చానని తెలిపారు. అక్కడ దుండగుడిని చూసి పట్టుకొనేందుకు యత్నించాను. వెంటనే అతడు నా వీపు, మెడ, చేతులపై కత్తితో పొడిచాడని వివరించారు. అతడిని గదిలో బంధించాలని తీవ్రంగా ప్రయత్నించాను’’ అని సైఫ్ పోలీసులకు తెలిపారు. తెల్లవారు జామున 2.30గంటల సమయంలో దాడి జరిగినట్లు చెప్పారు.