ఉనికి లేని పార్టీ టీఆర్‌ఎస్‌…మేము ఎలా పోతే మీకెందుకు ?: సజ్జల కౌంటర్ !

-

టీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.. కేంద్రం నుంచి రావాల్సింది రప్పించుకోవడం మా హక్కు అని కేసీఆర్ గతంలో అన్నారని… నిధుల రాబట్టే విషయంలో మిగిలిన వారు కూడా అలాగే వ్యవహరిస్తారని చురకలు అంటించారు. మేము బిచ్చమెత్తుకుంటున్నారని తెలంగాణ నేతలు మాట్లాడితే అది వారి విచక్షణకే వదిలేస్తున్నామని… బిచ్చ మెత్తుకుంటున్నారని తెలంగాణ నేతలు మాట్లాడటం వారి రాజకీయ అజ్ఙానమే అవుతుందని ఫైర్‌ అయ్యారు సజ్జల.

కేంద్రం నుంచి నిధులను రావాల్సిన పద్దతుల్లో రాబట్టుకుంటున్నామని… వారు ఎలా పోవాలో వారు చూసుకోవాలి, మేము ఎలా పోతే మీకేంటి..? అంటూ టీఆర్‌ఎస్‌ పై ఫైర్‌ అయ్యారు. వారి సమస్యల నుంచి తప్పించుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని… వారి సమస్యలనుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే తెలంగాణ నేతలు ఇలా ఎపీ గురించి మాట్లాడుతున్నారని.. టీఆర్ఎస్ కు ఎపీలో ఉనికి లేదని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉనికి లేని పార్టీ..ఇక్కడి వాటి గురించి కామెంట్ చేయడం సరైంది కాదని ఆగ్రహించారు. అన్ని రీసోర్సులు హైదరాబాద్ లో ఉన్నాయని… రాష్ట్రాన్ని విడదీసి అన్యాయం చేశారని అప్పుడు మేం అన్నామని గుర్తు చేశారు. టీడీపీ లాగే టీఆర్‌ఎస్‌ విమర్శలు చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version