టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ దుమారంపై స్పందించారు. ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే మాధవ్ పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని పునరుద్ఘాటించారు సజ్జల రామకృష్ణారెడ్డి. అయితే, ఆ వీడియో ఒరిజనలో, కాదో తెలుసుకోవడానికి అరగంటో, గంటో చాలని అంటున్నారని, నాడు చంద్రబాబునాయుడు పక్కా ఆధారాలతో దొరికిపోయిన ఓటుకు నోటు వ్యవహారమే ఇప్పటికీ తేలలేదని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబుకు ఆనాడు అంతరంగికుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఈ కేసులో ఉన్నారని, స్టీఫెన్ సన్ కు బ్యాగు ఇవ్వడం ఉందని, మనవాళ్లు బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు ఒరిజినల్ వాయిస్ కూడా ఉందని వివరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ వాయిస్ కు తగినట్టు అవతల డబ్బులు ఇచ్చిన ఘటన కూడా జరిగిందని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.
ఆ వాయిస్ చంద్రబాబుదేనని అందరికీ తెలుసని, కానీ ఆయన ఒప్పుకోవడంలేదని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇందులో అన్ని ఆధారాలు ఉన్నా ఈ కేసు ఏడేళ్లయినా తెమలడంలేదని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. కానీ, గోరంట్ల మాధవ్ వ్యవహారంలో అవతలి వాళ్లెవరో తెలియదని, ఆ వీడియోలో అభ్యంతరకరంగా చూపించిన భాగంలో ఉన్నది మార్ఫింగ్ చేశారని మాధవ్ అంటున్నారని వివరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాధవ్ అంశంలో ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదని, అటు చంద్రబాబునాయుడు అంశంలో పెద్ద కేసే నడుస్తోందని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. మాధవ్ కు సంబంధించి ఒరిజినల్ బయటికి రాలేదని, ఆ వీడియోను ఇంకో వీడియోగా షూట్ చేసింది మాత్రం బయటికొచ్చిందని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఓటుకు నోటు కేసులో అన్నీ ఒరిజినల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ఒక పార్టీకి అధినేత అని, మాజీ ముఖ్యమంత్రి అని, ఏదో సామాన్య కార్యకర్త కాదని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల వ్యవస్థనే భ్రష్టుపట్టించే విధంగా, రాజ్యాంగాన్నే అవహేళన చేసేవిధంగా వ్యవహరించారని విమర్శించారు. ఆ సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారని, కాబట్టి ఓటుకు నోటు కేసు తేలాలని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి.