ప్రభుత్వం అంటే ఏమైనా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీనా : సజ్జల

-

కార్యకర్తల్లో అసంతృప్తి ఉందంటేనే ప్రభుత్వం ఎంత నిష్పాక్షికంగా ఉందనేది అర్ధమని, దీనిలో దాపరికం లేదని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబులా మా వాళ్ళకే మేలు జరగాలన్న ఆలోచన జగన్‌కు ఉండదని, మా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు…కానీ రాష్ట్రం బాగుందని పేర్కొన్నారు సజ్జల. సాంకేతిక సమస్య వల్లే జీపీఎఫ్ అకౌంట్ల నుంచి డబ్బులు విత్ డ్రా అయ్యాయని సజ్జల స్పష్టం చేశారు. అంతేకాకుంఆ.. ప్రభుత్వం అంటే ఏమైనా మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీనా.. ఉద్యోగుల సొమ్మును ఇష్టం వచ్చినట్టు తీసుకుని ఊరుకోవటానికి అంటూ వ్యాఖ్యానించారు.

ఉద్యోగుల సొమ్ము 800 కోట్లను తీసుకుని ప్రభుత్వం ఏం చేస్తుందని, ఏ ప్రభుత్వమైనా ఉద్యోగుల సొమ్మును తీసేసుకోగలుగుతుందా.. దాని వల్ల ప్రభుత్వానికి ఏం లాభం కలుగుతుంది.. చంద్రబాబు అధికారంలో లేడనే కారణంతో ఒక చిన్న సాంకేతిక సమస్యను కూడా ఆర్ధిక సంక్షోభ స్థాయిలో ఒక వర్గం మీడియా చూపిస్తోందని ఆయన మండిపడ్డారు. మళ్ళీ అధికారంలోకి రాలేం అన్న నిస్పృహతో చంద్రబాబు మాయ యుద్ధం చేస్తున్నారంటూ సజ్జల ఆగ్రహ వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి అని.. అన్ని అభూత కల్పనలు.. ఒకటికి వందసార్లు అబద్ధాలు చెబుతూ నిజాలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు సజ్జల. రాజకీయం చేసే విధానం ఇది కాదని ఆయన హితవు పలికారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version