పాలిచ్చే తల్లులు వీటిని అస్సలు తినకూడదు.. ఎందుకంటే?

-

బిడ్డకు తల్లి పాలు చాలా మంచిది.. పుట్టినప్పటి నుంచి ఆరు నెలలు వయస్సు వచ్చే వరకూ తల్లి పాలు తప్ప ఏది అవసరం లేదని వైద్యులు కూడా చెబుతున్నారు.బిడ్డకు తొలి పోషణ, తొలి రక్షణ ఇచ్చేది ఇవే. బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే.. తల్లి పాలు ఇవ్వడం శ్రేయస్కరం అని ఆరోగ్య నిపుణుల చెబుతుంటారు. అనేక వ్యాధికారకాలను సమర్థంగా ఎదుర్కోవడంలో దోహదపడే యాంటీబాడీలు, పోషకాలు తల్లిపాలలో ఉంటాయి. బిడ్డకు పాలివ్వడం కేవలం శిశువుకే కాదు.. తల్లి ఆరోగ్యానికీ ఎంతో మంచిది.

 

పాలిచ్చే తల్లులు తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్త వహించడం తప్పనిసరి. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహార ప్రభావం బిడ్డ మీద తప్పకుండా ఉంటుంది.పాలిచ్చే తల్లులు కొన్ని ఆహారాలుకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు అంటున్నారు. ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మసాలా దినుసులు..దాల్చినచెక్క, వెల్లుల్లి..మిరియాలు తీసుకోకూడదు..బిడ్డ జీర్ణవ్యవస్థ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి మసాలాదినుసుల ప్రభావాన్ని తట్టుకుని జీర్ణించుకోవడం పిల్లలకు కష్టంగా ఉంటుంది.మనం తీసుకొనే మసాలా పాలల్లో కలిసే అవకాశం ఉంది.. అందుకే వాసన వచ్చే వాటికి దూరంగా ఉండటం మంచిది.

కాఫీ..రోజుకు రెండుసార్లు కాఫీ తాగితే ఫర్వాలేదని.. అంతకంటే ఎక్కువగా తీసుకుంటే పిల్లలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. కాఫీలో ఉండే కెఫీన్‌ని పిల్లలు ఈజీగా అరిగించుకోలేరు. దీంతో పిల్లలు రాత్రి సమయంలో సరిగా నిద్రపోకపోవడం, చికాకుగా ప్రవర్తించడంలాంటివి చేస్తారు. బాలింతలు కెఫీన్ సంబంధిత పదార్థాలన్నింటికీ దూరంగా ఉండటమే సురక్షితం..అలాగే చాక్లెట్ లు కూడా తినకూడదు..

కూరగాయలు..ఉల్లిపాయలు, బ్రకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజ్, దోసకాయ, బంగాళాదుంపలు, ముల్లంగి, కిడ్నీ బీన్స్‌ లాంటి కూరగాయలకు పాలిచ్చే తల్లులు దూరంగా ఉండాలి. వీటిని ఎక్కువగ తీసుకుంటే బిడ్డకు కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంది. వేరుశెనగ, మొక్కజొన్న, కిడ్నీ బీన్స్, చిక్‌పీస్, వేరుశెనగ, మొక్కజొన్న లాంటి కాయధాన్యాలను తక్కువగా తీసుకోండి…ఇంకా సి విటమిన్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్ల పాలలో యాసిడ్‌ గుణం పెరుగుతుంది. దీని వల్ల పిల్లల్లో కడుపు నొప్పి, విరేచనాలు, చికాకు వచ్చే అవకాశం ఉంది. పైనాపిల్, కివీ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లను ఆహారంగా తీసుకోకూడదు…మొత్తానికి చూసుకుంటే ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపునులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version