కూకట్ పల్లి కోర్ట్ లో సమంత దాఖలు చేసిన పిటిషన్ పై మరోసారి వాదనలు వినిపించాలని కూకట్ పల్లి కోర్టు పేర్కొంది. దీంతో మరోసారి వాదనలు వినిపింఛారు సమంత తరపు న్యాయవాది బాలాజీ. సమంత ప్రతిష్ఠ ను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు సమంత తరపు న్యాయవాది బాలాజీ.. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి పై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చెయ్యడం సరైంది కాదని కోర్టు కు విన్నవించారు..
తమ పిటీషన్ లో ఎక్కడ కూడా సమంత డబ్బులు అడగలేదని బాలాజీ పేర్కొన్నారు. యూట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరుతున్నామని.. భవిష్యత్తులో ఇలాంటి వార్తలు రాయకుండా …పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు సమంత తరఫు న్యాయవాది బాలాజీ. గతంలో శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని గుర్తు చేశారు బాలాజీ. సమంత తరపు న్యాయవాది బాలాజీ వాదనలు విన్న కూకట్ పల్లి కోర్ట్… తీర్పు రేపటికి వాయిదా వేసింది. వాదనలు పూర్తి కావడం తో తీర్పు రేపటికి రిజర్వ్ చేసింది కూకట్ పల్లి కోర్ట్…