తీవ్ర వివాదంలో స‌మంత‌.. ఆ సిరీస్ పై త‌మిళ ప్ర‌భుత్వం లేఖ‌

-

స‌మంత‌కు గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఇప్పుడు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. సినిమాలు చేసిన‌న్ని రోజులు ఒక్క‌టంటే ఒక్క వివాదం కూడా ఆమె ద‌రిచేర‌లేదు.కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ కార‌ణంగా ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రాజ్ అండ్ డీకే క‌లిసి తీసిన ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్ ట్రైల‌ర్ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎన్నో అవాంత‌రాలు ఎదుర‌వుతున్నాయి.

ఇప్పుడు ఈ వివాదం తారా స్థాయికి చేరుకుంది. ఈ సిరీస్‌లో తమిళులకు అవమానం ఎదురవుతోందని టాక్ న‌డుస్తోంది. ఈ సిరీస్ ప్రీమియర్లను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం సమాచార ప్రసార మంత్రికి ఏకంగా లేఖను రాసింది.

ఆ లేఖ‌లో ఈ విధంగా పేర్కొంది. సిరీస్ లో ఈలం తమిళులను అత్యంత అభ్యంతర విధానంలో చూప‌ర‌ని, శ్రీలంకలో ఈలం తమిళుల చారిత్రక పోరాటాన్ని వక్రీకరించారంటూ ఆరోపించింది.ఇది తమిళ సంస్కృతికి వ్యతిరేకంగా ఉందంటూ లేఖ‌లో రాసింది. దీంతో త‌మిళ ప్ర‌జ‌లు ఈ సిరీస్‌పై మండిప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇందులో స‌మంత ఉగ్ర‌వాదిగా న‌టించ‌డం తమిళుల పై నేరుగా దాడి చేయడమేనని ఈ లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ సిరీస్ విడుద‌ల‌వుతుందా లేదా అనే సందేహంలో ఉన్నారు అభిమానులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version