తన అనారోగ్యంపై సమంత భావోద్వేగం.. ఇంకా చావలేదంటూ..!!

-

ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజాగా మయోసిటిస్ వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఈమె త్వరగా ఆ వ్యాధి నుంచి కోలుకోవాలని అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సైతం ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత ను యాంకర్ సుమ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంటర్వ్యూలో భాగంగా తాను భావోద్వేగానికి గురై.. తాను ఇంకా చావలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కన్నీరు పెట్టుకుంటూ అందరి చేత కన్నీటిని పెట్టించింది.

అసలు విషయంలోకి వెళ్తే.. సమంత తాజాగా నటించిన చిత్రం యశోద.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.. సమంత మాట్లాడుతూ.. నేను పోస్టు లో చెప్పినట్టు కొన్ని రోజులు మంచిగా ఉంటాయి.. మరికొన్ని రోజులు చెడుగా ఉంటాయి.. ఒక్కొక్క రోజు అయితే ఇంకో అడుగు కూడా ముందుకు వేయలేను.. ఆరోజు గడిస్తే చాలు అన్నట్టుగా భావిస్తాను . కానీ కొన్నిసార్లు తిరిగి చూస్తుంటే ఇంత దాటేసి వచ్చానా అనిపిస్తుంది.. అంటూ సమంత తెలిపింది. ఈ క్రమంలోని సమంత భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకుంది.

నేను ఒక్క దానివే కాదు.. చాలా మంది ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారు. నేను ఎన్నో ఆర్టికల్స్ చూశాను.. లైఫ్ త్రేటేనింగ్ కాదు ప్రస్తుతానికైతే నేను చావలేదు..అయితే ఇది కష్టంతో కూడుకున్నది . దీనిపై నేను పోరాటం చేయాలి అంటూ సమంత తెలిపింది. ప్రస్తుతం తాను మయో సిటీస్ అనే ప్రమాదకరమైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతోంది. అయితే ఈమె మనోధైర్యానికి మెచ్చుకుంటూ అభిమానులు , సెలబ్రిటీలు వరుసగా సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. అంతే కాదు త్వరగా సమంత కోలుకోవాలని కూడా చెబుతూ ఉండడం గమనార్హం. మొత్తానికి అయితే సమంత ఇలా చెప్పడంతో అభిమానులు ఒక్కసారిగా కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version