తగ్గేదెలా…భారీగా రెమ్యునరేషన్ పెంచేసిన సమంత ?

-

అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత… తన కెరీర్ పై దృష్టి పెట్టింది సమంత. ఈ నేపథ్యంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ…. డబ్బులు బాగానే సంపాదిస్తోంది.  టాలీవుడ్ లోనే కాకుండా, బాలీవుడ్ లోనూ సినిమాలకు ఓకే చెప్పేస్తోంది సమంత. ఇక ఈ తరుణంలోనే సమంత పై ఓ రూమర్ స్ప్రెడ్ అవుతోంది.

ఇటీవల అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన పుష్ప చిత్రంలోని స్పెషల్ సాంగ్ తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది సమంత. దీంతో తన తదుపరి చిత్రాలకు ఆమె భారీగా రెమ్యూనిరేషన్ పెంచినట్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆమె చేయబోయే సినిమాలకు దాదాపు 3 నుంచి 8 కోట్ల వరకు వసూలు చేస్తుందని సమాచారం అందుతుంది. ఇప్పటివరకు తెలుగులో సమంత ఒక్కో సినిమాకు మూడు కోట్లు తీసుకుందని…. బాలీవుడ్లో ఐదు నుంచి 8 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సమంత హిందీలో యంగ్ హీరో వరుణ్ ధావన్ సరసన చిట్టాడెల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version