సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్గా ఉండే ముద్దుగుమ్మ సమంత టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా పేరుపొందింది. కొత్త సినిమా అప్డేట్ లతో పాటు తన వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉండేది. అలాంటి సమంత ఇటీవల కాలంలో అన్నిటికీ దూరంగా ఉన్నది. దీంతో అభిమానులలో పలు రకాల వార్తలు సందేహాలు కూడా కలిగాయి. ముఖ్యంగా సమంత అనారోగ్యానికి గురైందని, అందుకోసం చికిత్స చేయించుకోవడానికి విదేశాలకు వెళ్ళింది అని వార్తలు కూడా బాగా వైరల్ గా మారాయి. సమంత పైన పలువురు నిర్మాతలు సైతం చాలా సీరియస్ గా ఉన్నారని వార్తలు కూడా వినిపించాయి.
ఎట్టకేలకు ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా తనదైన స్టైల్ లో సమాధానం తెలియజేసింది సమంత. నిన్నటి రాత్రి సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో తన పెట్ డాగ్ ఫోటోని షేర్ చేస్తూ వెనక్కి తగ్గా.. ఓడిపోలేదు.. అంటూ ఒక క్యాప్షన్ ని తెలియజేసింది. ప్రస్తుతం సమంత పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతుంది. ఇక సమంత వ్యక్తిగత జీవితం గురించి ఆ పోస్ట్ పెట్టిందని పలువురు నెటిజెన్ లు సైతం భావిస్తూ ఉన్నారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్న మాట వాస్తవమే కానీ నిజానికి ఆమె సురక్షితంగా ఉన్నట్లుగా ఆ మీనింగ్ వస్తుందని అభిమానులు తెలియజేస్తున్నారు
ఇక సమంత చేసిన ఈ పోస్ట్ పైన పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం సమంత నటించిన సినిమాల విషయానికి వస్తే యశోద, శాకుంతలం, ఖుషి వంటి సినిమాలలో నటిస్తూ ఉన్నది. ఈ చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల కాబోతున్నాయి. మరి సమంత ఏ చిత్రంతో సక్సెస్ అందుకుంటుందో చూడాలి మరి.<
/p>