విడాకుల తర్వాత సమంత పరిస్థితి అదేనా..?

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత అనతి కాలంలోనే భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఏ మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె వెండితెరపై 12 ఏళ్లుగా నిరాటంకంగా అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. మొదటి సినిమా నుంచి యశోద సినిమా వరకు ఆమె కెరియర్ లో ఏ రోజు ఆటంకాలు ఎదురు కాలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి సోలోగా వచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అందం, అభినయంతో పాటు అదృష్టం, ప్రతిభ ఈమెకు తోడయ్యాయి. దాంతో సమంతాను ఆపడం ఎవరి తరం కాలేదు. ఇప్పుడున్న హీరోయిన్లతో పోల్చుకుంటే సమంత సక్సెస్ రేట్ చాలా ఎక్కువ అని చెప్పాలి.

ముఖ్యంగా టాలీవుడ్ , కోలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే నాగచైతన్యను వివాహం చేసుకోని తర్వాత నాలుగేళ్లు సంతోషంగా జీవించింది. కానీ నాగచైతన్య తో విడాకులు తీసుకునే వరకు వచ్చింది అంటే పరిస్థితులు ఏ రకంగా మారిపోయాయో అర్థం చేసుకోవచ్చు. ఆర్థికంగా సమంత కంటే అక్కినేని ఫ్యామిలీ ముందు వరుసలో ఉన్నా..సక్సెస్ తో పోల్చుకుంటే నాగచైతన్యతో పోలిస్తే సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నాకంటే కెరియర్ పరంగా సమంత సూపర్ అని నాగచైతన్య కూడా కామెంట్ చేశారు.

కానీ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. సుమారుగా ఈమెకు రూ.200 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నప్పటికీ ఏ రోజు కూడా నాగచైతన్య పై ఈమె ఆధారపడలేదు. ప్రస్తుతం మయోసిటీస్ వ్యాధి బారిన పడింది. ఒకవైపు వ్యాధి మరొకవైపు కట్టుకున్న భర్త కూడా దూరమయ్యాడు. దీంతో ఆమె పరిస్థితి మరింత అద్వానంగా మారుతోందని వార్తలు సన్నిహితుల నుంచి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. కనీసం సమంత ఇప్పటికైనా నాగచైతన్యతో కలిసి పోవాలి అని తను మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version