మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం శాసనమండలిలో ఆమోదం పొందాల్సిన వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో చైర్మన్ తన విశేషాధికారాలను ఉపయోగించుకుని బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో జగన్ సర్కార్ శాసనమండలిని రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసినదే.
ఈ సందర్భంగా శాసన మండలి రద్దు ని అసెంబ్లీలో ఆమోదింప చేసిన జగన్ ఆ బిల్లును పార్లమెంటరీ సెక్రెటరీ కి పంపించడం జరిగింది. అయితే అసలు అమరావతి రాజధాని విషయంలో జగన్ ఇంత దూకుడుగా వ్యవహరించడానికి గల కారణం చంద్రబాబు అని ఇటీవల బయటపడింది. మేటర్ లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతి గెజిట్ నోటిఫికేషన్ చంద్రబాబు తన హయాంలో ఇవ్వలేదని చంద్రబాబు కనుక తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గెజిట్ నోటిఫికేషన్లో అమరావతి గురించి పేర్కొని ఉంటె, ఇప్పుడు రాజధానిని మార్చేవారు కాదు.
సాంకేతికంగా అమరావతికి చట్టబద్దత కల్పించడంలో బాబు ఫెయిల్ కావడంతో జగన్ మూడు రాజధానుల అంశం పైకి తీసుకురావడం జరిగిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే తప్పు ఏపీకి స్పెషల్ స్టేటస్ విషయంలో చేశారని మళ్లీ అదే తప్పు రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చేయడం జరిగిందని సరైన సమయంలో సరిగ్గా వ్యవహరించకపోవడం తోనే రాజధాని అమరావతి విషయంలో రాజకీయంగా చంద్రబాబు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.