ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త వస్తువులను మార్కెట్ లోకి విడుదల చేస్తూ వస్తుంది.ఆ వస్తువులు అన్నీ కూడా అందరినీ ఆకట్టుకోవడంతో మార్కెట్ లో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది.కాగా, ఇప్పుడు మరో స్మార్ట్ టీవీని మార్కెట్ లో లాంచ్ అయ్యింది..4K స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. సరసమైన ధరకే PurColor టెక్నాలజీతో అందిస్తోంది..ఆ టీవీ గురించి వివరంగా తెలుసుకుందాం..
Samsung Crystal 4K Neo TV 43-అంగుళాల సైజులో ఉంటుంది. HDR10+తో 4K ప్యానెల్ వంటి ఫీచర్‌లను అందిస్తుంది. అన్ని ప్రముఖ స్ట్రీమింగ్ యాప్‌లకు ఇది సపోర్ట్ చేస్తుంది. శాంసంగ్ సరసమైన 4K TVలలో ఒకటి.. అందుకే OLED ప్యానెల్‌కు బదులుగా సాధారణ LEDని మాత్రమే అందిస్తోంది. Samsung Crystal 4K Neo TV 3840×2160 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 50Hz, HDR10+, వన్ బిలియన్ ట్రూ కలర్స్ టెక్నాలజీ రిఫ్రెష్ రేట్‌తో ప్యానెల్‌ను అందిస్తుంది..
క్రిస్టల్ 4K ప్రాసెసర్ ఆధారంగా రన్ అవుతుంది. ప్రస్తుతం Samsung కేవలం 43-అంగుళాల మోడల్‌ను మాత్రమే అమ్ముతుంది..అయితే 55 అంగుళాల టీవీ కూడాఉంది.ధర ఎంత అనేది శాంసంగ్ రివీల్ చేయలేదు. Samsung కొత్త టీవీ మోషన్ Xcelerator ఫీచర్‌ను కూడా అందిస్తుంది. కంపెనీ ప్రకారం.. యాక్షన్ సీక్వెన్స్‌లు సున్నితంగా కనిపించేలా చేయడానికి ఆటో ప్రేమ్‌లను యాడ్ చేసింది. ఈ ఫీచర్ గేమర్‌లకు బెస్ట్ ఆప్షన్..
ఫీచర్స్..
స్మార్ట్ అడాప్టివ్ సౌండ్ ఫీచర్ టీవీ సౌండ్‌ని కంటెంట్‌కు అనుగుణంగా అడ్జెస్ట్ అవుతుంది. వాల్యూమ్‌ను మాన్యువల్‌గా అడ్జెస్ట్ చేయడానికి రిమోట్ కంట్రోల్‌ని మీ చేతిలో ఎప్పుడూ ఉంచుకోవాల్సిన అవసరం లేదు. సరౌండ్ ఎఫెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే.. టీవీ స్పీకర్‌లు, సౌండ్‌బార్ నుంచి సౌండ్‌ని సింక్రొనైజ్ చేసే Q-సింఫనీ ఫీచర్ కూడా ఉంది..స్మార్ట్ టీవీ లకు ఉన్న అన్నీ ఫీచర్స్ కలిగి ఉంది.యాప్ లన్నీ ముందుగానే ఇన్‌స్టాల్ చేసి ఉంటుంది.
ధర..
ఈ టీవీ ధర కేవలం రూ.35,990గా ఉంది..అన్ని ఆన్‌లైన్ స్టోర్ లలో అందుబాటులో ఉంది.మీకు నచ్చితే మీరు కూడా కొనుగోలు చెయ్యండి..