శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఎఫ్62 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత్ లో సోమవారం లాంచ్ చేసింది. ఇందులో 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ కలిగిన ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్‌ను అమర్చారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. వెనుక వైపు 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడు మరో 12 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సల్ మాక్రో సెన్సార్‌లు ఉన్నాయి. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు.
ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. 3డి గ్లాస్టిక్ బ్యాక్‌ను అమర్చారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ పక్క భాగంలో ఉంటుంది. డెడికేటెడ్ డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్లను ఏర్పాటు చేశారు. శాంసంగ్ పే ఫీచర్ లభిస్తుంది. 7000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఇందులో ఉంది. దీనికి 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ లభిస్తుంది. యూఎస్‌బీ టైప్ సి పోర్టును ఇచ్చారు. రివర్స్ చార్జింగ్ ఫీచర్ కూడా ఉంది.
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 ఫీచర్లు…
* 6.7 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ-ఓ సూపర్ అమోలెడ్ ప్లస్ డిస్‌ప్లే
* 2400 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9825 ప్రాసెసర్
* 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 11, డ్యుయల్ సిమ్, 64, 12, 5, 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు
* 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్
* శాంసంగ్ పే, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జి వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై
* బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, ఎన్ఎఫ్‌సీ
* 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ల ఫాస్ట్ చార్జింగ్
శాంసంగ్ గెలాక్సీ ఎఫ్62 స్మార్ట్ ఫోన్ లేజర్ గ్రీన్, లేజర్ బ్లూ, లేజర్ గ్రే కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.23,999 ఉండగా, 8జీబీ ర్యామ్ వేరియెంట్ ధర రూ.25,999గా ఉంది. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ఈ ఫోన్ ను విక్రయిస్తారు. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా ఈ ఫోన్‌పై రూ.2500 ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ పొందవచ్చు.