ఈ సీజన్‌లో మూడోసారి స్లో ఓవర్ రేట్ నమోదు చేసినందుకు గాను రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్‌పై ఐపీఎల్ యాజమాన్యం ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది.దీనికి ముందు బీసీసీఐ అంబుడ్స్మన్ కమిటీ ఎదుట ఢిల్లీ మెంటార్ గంగూలీ, కోచ్ రికీ పాంటింగ్ చేసిన వాదనలు తాజాగా బయటకొచ్చాయి. సంజూ క్యాచ్ ఔట్ నిర్ణయం ఆలస్యమవడం, వైడ్లు ఎక్కువ పడటం వంటివి కారణాలుగా చూపారు. బౌలర్ల పొరపాటుకు పంత్ బాధ్యుడు కాదని వాదించారు. అయితే సరైన ఆధారాలు లేవని కమిటీ నిషేధం విధించింది.
కాగా, ఐపీఎల్ 2024 లో భాగంగా ఈరోజు (మే 12) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరగనున్న మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వ్యవహరించనున్నాడు.గత రెండు సీజన్‌లుగా అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో కూడా మంచి అనుభవం ఉంది. అక్షర్ తెలివైన వ్యక్తి. ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. కెప్టెన్సీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నాడు అని ఢిల్లీ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తెలిపారు.