మేధాశక్తికి సరస్వతి మొక్క రసం నెంబర్‌ వన్‌ సొల్యూషన్‌..! ఇంకా ఎన్నో లాభాలు..

-

అమ్మఒడి ఎంత హాయిగా ఉంటుందో.. ప్రకృతి ఒడి కూడా అంతే..ఎన్నోరోగాలకు పరిష్కారాలను తన గుప్పెట్లో పెట్టుకుంది ప్రకృతి.. స్వచ్ఛమైన ప్రేమ అమ్మ సొంతం అయితే.. ఏ రోగానికి అయినా తిరుగులేని పరిష్కారం ప్రకృతి సొంతం.. మనకే వాటి విలువ తెలియక చూసి చూడనట్లు వదిలేస్తాం.. రోజు మన కళ్లముందు ఎన్నో మొక్కలను చూస్తుంటాం.. కానీ వాటి పేర్లు, ఆ మొక్కల ఉపయోగాలు తెలియక పిచ్చిమొక్కలు అనుకోని లైట్‌ తీసుకుంటాం.. అలా మీరు లైట్‌ తీసుకున్న మొక్కల్లో ఒకటి సరస్వతి మొక్క. ఈ మొక్కను చాలామంది చూసే ఉంటారు.. కానీ దీని పేరు కూడా మీకు తెలిసి ఉండకపోవచ్చు.. ఈ సరస్వతి మొక్క వల్ల కలిగే లాభాలేంటో ఈరోజు చూద్దాం.!
మాన‌సిక ఒత్తిడి, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం ఈ ఆకుల‌ను తింటే మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది.
ప‌చ్చ కామెర్లు వ‌చ్చిన వారికి స‌ర‌స్వ‌తి మొక్క ఆకుల రసాన్ని నిత్యం తాగిస్తుంటే.. ఆ వ్యాధి నుంచి వెంట‌నే కోలుకుంటారట.
స‌రస్వ‌తి ఆకుల ర‌సాన్ని నిత్యం తాగితే ఆయుష్షు పెరుగుతుంద‌ని ఆయుర్వేదంలో చెబుతారు..
స‌ర‌స్వ‌తి మొక్క పేరుకు త‌గిన‌ట్లుగానే ప‌నిచేస్తుంది. ఈ మొక్క ఆకులు మెద‌డు ప‌నితీరును మెరుగు ప‌రుస్తుందట. జ్ఞాప‌క‌శక్తిని పెంచుతుంది. నిత్యం 4 స‌రస్వ‌తి ఆకులను అలాగే న‌మిలి తింటే మేథ‌స్సు పెరుగుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
నిత్యం ఈ మొక్క ఆకుల ర‌సం తాగితే ర‌క్తం బాగా త‌యార‌వుతుంది. ర‌క్తాన్ని శుభ్రం చేయడానికి ఈ మొక్క బాగా ఉపయోగపడుతుంది.
వాము తీసుకుని పొడి చేసి అందులో స‌ర‌స్వతి మొక్క ఆకుల ర‌సాన్ని క‌లిపి తింటే.. కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది.
విద్యార్థులు ఈ మొక్క ఆకుల‌ను బాగా న‌లిపి ర‌సం తీసి దాన్ని పాల‌లో క‌లుపుకుని నిత్యం తాగితే…ఆ సరస్వతి దేవి మీ వెంటే ఉంటుంది.. అర్థం కాలేదా.. జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంది. చ‌దువుల్లో బాగా రాణిస్తారండీ..!
స‌ర‌స్వ‌తి మొక్క ఆకుల‌ను నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసి అందులో తేనె క‌లిపి తీసుకుంటే.. గొంతు బొంగురు త‌గ్గుతుంది. స్వ‌ర‌పేటిక వృద్ధి చెందుతుంది. మంచి కంఠ స్వ‌రం వస్తుందట..
సరస్వతి మొక్క‌ ఆకులను నీడలో ఎండబెట్టి..5 బాదంపప్పులు, 2 మిరియాలు, వేడి నీరు పోసి ఈ ఆకులను మెత్తగా పేస్ట్‌లా చేయాలి. తరువాత ఆ మిశ్ర‌మాన్ని పలుచని వస్త్రంతో వడకట్టి అనంత‌రం వ‌చ్చే ద్ర‌వంలో తగినంత తేనె కలిపి 40 రోజుల పాటు ఉదయం తాగితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మాటలు సరిగ్గా రాని పిల్లలకు వాడుతారు. నత్తిని తగ్గించే శక్తి దీనికి ఉంటుంది.
ఈ మొక్క‌ల ఆకుల‌ను మ‌జ్జిగ‌లో 3 రోజులు నాన‌బెట్టి త‌రువాత వాటిని తీసి ఎండ‌బెట్టి అనంత‌రం వాటిని పొడి చేయాలి. ఈ పొడిని నిత్యం టానిక్‌లా పిల్ల‌ల‌కు ఇస్తే.. వారికి శ‌క్తి బాగా ల‌భిస్తుంది.
ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్న ఈ మొక్కను ఈ సారి కనిపిస్తే పిచ్చి మొక్క అని పక్కనపడేయకుండా.. అవసరం ఉంటే వాడేయండి. అయితే మీకు డౌట్‌ రావొచ్చు.. అది సర్వసతీ మొక్క అని గుర్తుపట్టడం ఎలా అని.. యూట్యాబ్‌లో వీడియోలు చూస్తే మీకే క్లారిటీ వస్తుంది..! ఏమంటారు..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version