చీర కట్టు.. తలలో మల్లెలు.. అనుపమ అందం మామూలుగా లేదుగా..

-

నితిన్ హీరోగా నటించిన అ ఆ చిత్రంతో టాలీవుడ్ లో పెట్టిన ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ మలయాళీ భామ అయినప్పటికీ అచ్చం తెలుగు అమ్మాయిల ప్రేక్షకుల్ని ఇట్టే ఆకట్టుకునే అందం ఈ భామ సొంతం.. అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పోస్టులు పెట్టే అనుపమ తాజాగా చీరకట్లు తలలో మల్లెలు పెట్టి ప్రేక్షకులను కళ్ళు తిప్పుకొనివ్వన్నట్టు చేస్తుంది..

ఆ సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటికీ అంతకుముందే ప్రేమ చిత్రంలో నటించి మంచి పేరు సంపాదించుకుంది అనుపమ పరమేశ్వరన్.. శతమానం భవతి, హాలో గురు ప్రేమ కోసమే, ఉన్నది ఒక్కటే జిందగీ లాంటి చిత్రాల్లో అనుపమ నటించింది. ప్రస్తుతం మరికొన్ని చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా అనుపమ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే తాజాగా కార్తికేయ టు సినిమా హిట్ తో మంచి జోష్ లో ఉంది.. చందు ముండేది దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శ్రీకృష్ణుడి గురించి అద్భుతంగా చూపించారు.

తాజాగా అనుపమ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలు షేర్ చేసింది.అనుపమ మోడ్రన్ డ్రెస్ లతో పాటు సాంప్రదాయ వస్త్రధారణలో కూడా మెరిసిపోవడం చూస్తూనే ఉన్నాం. అనుపమ చీర కడితే ఆ అందమే వేరు. చీరకట్టులో అనుపమ చిరునవ్వులు చిందిస్తూ చిలిపిగా ఫోజులు ఇస్తోంది. మైండ్ బ్లాక్ చేసే విధంగా అనుపమ ఇస్తున్న ఫోజులు కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇస్తున్నాయి. జడలో మల్లెలు, ఆభరణాలతో అనుపమ అందాల దేవతలా మైమరిపిస్తోంది. ఇందులో కొన్ని స్టిల్స్ క్యూట్ గా, మరికొన్ని స్టిల్స్ లో చిరునవ్వుతో అనుపమ ఇస్తున్న ఫోజులు అదరహో అనిపిస్తున్నాయి. అలాగే అనుపమ డ్రెస్ వేసుకున్న జీన్ వేసిన చీర కట్టులో అయినా చాలా అందంగా ఉంటుంది ఈ ఫోటోలు చూస్తే అభిమానులు ఎప్పటికప్పుడు మైమరచిపోతూ ఉంటారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version