బెంగళూరు విక్టోరియా ఆస్పత్రి నుంచి శశికళ డిశ్చార్జ్ అయ్యారు. ఫిబ్రవరి 8న బెంగుళూరు నుంచి శశికళ చెన్నై వెళ్లనున్నట్టు చెబుతున్నారు. అయితే శశికళ చెన్నై రాకముందే తమిళ రాజకీయాలు హీటెక్కాయి. జయలలిత తరహా కారులో ముందు ఏఐడీఎంకే జెండాతో శశికళ హాస్పిటల్ నుండి బయటకు రావడంతో వివాదం మొదలయింది.
శశికళ పార్టీ జెండా వాడకం పై మంత్రి జై కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఆమె పార్టీలో లేనప్పుడు జెండా ఎలా వాడుతారు అని మంత్రి ప్రశ్నిస్తున్నారు. అయితే శశికళ ఇప్పటికీ ఏఐడీఎంకే జనరల్ సెక్రటరీనే అని శశికళ వారం రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉంటారు అని ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారం చూస్తుంటే ఖచ్చితంగా తమిళనాట రచ్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. చిన్నమ్మ ఎంట్రీతో మరింత రసవత్తరంగా మారనున్నాయి అని చెప్పచ్చు.