Sathya Dev : ఫుల్ బాటిల్ తో వస్తున్న హీరో సత్యదేవ్..

-

మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో చిన్న పాత్రతో నటనా ప్రస్థానం ప్రారంభించాడు సత్యదేవ్. ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, ముకుందా చిత్రాల్లో నటించాడు. ‘జ్యోతిలక్ష్మీ’ చిత్రంలో ప్రధాన పాత్ర కోసం ఆడిషన్ చేసిన 500 మందికి పైగా కళాకారులలో సత్యదేవ్ ఎంపికయ్యాడు.ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయాన్ని సాధించలేకపోయింది. అయినప్పటికీ సత్యదేవ్ కి తగిన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ తో కలిసి ‘మన ఊరి రామాయణం’ అనే సినిమాలో నటించే అవకాశం లభించింది. 2020లో వచ్చిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య అనే చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇదిలా ఉంటే సత్యదేవ్ హీరోగా ఫుల్ బాటిల్ అనే సినిమా షూటింగ్ బుధవారం మొదలైంది. ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. రామాంజనేయులు జవ్వాజి, ఎస్.డి. కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. దర్శకుడు శరన్ కొప్పిశెట్టి తొలి రెండు చిత్రాలు కన్నడ రీమేక్స్ కాగా, ఇటీవల అతను జీ 5 కోసం ‘గాలివాన ‘ పేరుతో ఓ వెబ్ సిరీస్ చేశాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో సాగే ‘ఫుల్ బాటిల్ ‘ మూవీ కాకినాడ నేపథ్యంలో తెరకెక్కబోతుంది. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని ముందుకు సాగుతున్న సత్యదేవ్ కు ‘ఫుల్ బాటిల్ ‘ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version