అలా చేస్తే ముక్కు నేలకి రాస్తా.. కెసిఆర్ కి సవాల్ విసిరిన సత్య కుమార్

-

సీఎం కేసీఆర్ దసరా రోజు జాతీయ పార్టీని ప్రకటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ సీఎం కేసీఆర్ కి సవాల్ విసిరారు. తమ పార్టీ నుంచి ఏ ఒక్కరినీ బిఆర్ఎస్ లోకి లాక్కోగలిగినా ముక్కు నేలకు రాస్తానని అన్నారు.

” ఏపీలో ఏ ఒక్క బీజేపీ కార్యకర్తనన్నా మీరు పెట్టబోతున్న బిఆర్ఎస్ (భారత బార్ & రెస్టారెంట్ సమితి) పార్టీలోకి లాక్కోగలిగితే ముక్కు నేలకు రాస్తాను. మీరు పుట్టిన కాంగ్రెస్, పెరిగిన టిడిపి, తోడుదొంగ వైయస్సార్సీపి తో ట్రై చేసుకోండి. ఒకరో ఇద్దరో తలమాసినోళ్లు దొరక్కపోరు”. అంటూ ఘాటైన విమర్శలతో ట్వీట్ చేశారు బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version