సత్యదేవ్ ని ఇలా చూసి మీరు షాక్ తింటారు..!!

-

తెలుగు లో వున్న హీరోలలో సత్యదేవ్ రూటు సెపరేటు. తాను సినిమాలో ఏ పాత్ర  చేసినా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తాడు. రీసెంట్ గా గాడ్ ఫాదర్ లో చేసిన సత్యదేవ్ మెగాస్టార్ చిరంజీవి తో సమానంగా నటించి పేరు తెచ్చుకున్నాడు. అలాగే బాలీవుడ్ లో వచ్చిన రామ సేతు లో సినిమా ఆడకున్నా తనకి మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.

తనకోసం రచయితలు స్పెషల్ గా మంచి పాత్రలు రాస్తున్నారు.సత్యదేవ్ ప్రస్తుతం మూడు సినిమాలకు సంతకం చేసి వున్నారు. అందులో ఒక సినిమా పుల్ బాటిల్. పేరు చాలా విచిత్రంగా ఉంది కదా. అలాగే సినిమాలో ఆయన పాత్ర కూడా చాలా హ్యూమరస్ గా వుంటుందట. ఈ సినిమాలో సత్యదేవ్‌ మెర్క్యూరి సూరి అనే కారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమా పోస్టర్ కూడా వెరైటీగా వుంది. ఎస్‌డీ కంపెనీ, శర్వంత్రమ్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌లపై రామాంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా సంజనా ఆనంద్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా కు దర్శకుడు  శరణ్ కొప్పిశెట్టి.ఇటీవల విడుదలయిన మూవీ పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ పోస్టర్ లో రెండు చేతుల్లో రెండు గ్లాసుల్లో మద్యం తో మంచి కుషీగా నవ్వుతూ కవ్విస్తూ వున్నాడు.దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రకరకాల గా కామెంట్స్ చేస్తున్నారు. చూస్తూంటే ఇదో డిఫెరెంట్ కామెడీ సినిమాలా నిలిచే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version