స్టేట్ బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్..!

-

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. వీటి వలన చాలా లాభాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లని పెంచింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే….

 

7 రోజుల నుంచి 45 రోజుల వ్యవధి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 2.90 శాతం నుంచి 3 శాతం కి స్టేట్ బ్యాంక్ పెంచడం జరిగింది. ఇది ఇలా ఉంటే సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లను 3.40 శాతం నుంచి 3.50 శాతానికి పెంచారు. అలానే 180 నుంచి 210 రోజుల వ్యవధి కలిగిన ఎఫ్‌డీ రేట్లను 3 శాతం నుంచి 3.10 శాతానికి పెంచారు.

అదే విధంగా సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీ వడ్డీ రేట్లను కూడా 3.50 శాతం నుంచి 3.60 శాతానికి మార్చడం జరిగింది. ఇక ఏడాది నుండి రెండేళ్ళకి అయితే 4.90 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. సీనియర్ సిటిజన్లకు కూడా వడ్డీ రేట్లను 5.40 శాతం నుంచి 5.50 శాతంకి చేసింది స్టేట్ బ్యాంక్.

ఇది ఇలా ఉంటే రెండు నుంచి మూడేళ్ల వ్యవధి కలిగిన వడ్డీ రేట్లను 5.10 శాతంగానే ఉంచింది. ఎలాంటి మార్పు లేదు. ఈ వ్యవధిలో సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీ వడ్డీ రేటును కూడా 5.60 శాతంగా ఉంచింది. ఈ కొత్త వడ్డీ రేట్లు డిసెంబర్ 15, 2021 నుంచే అమలులోకి రావడం జరిగింది. దీని కారణంగా 40 కోట్ల మంది కస్టమర్లకి లాభదాయకంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version