ఎస్బీఐ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు పెంపు..

-

దేశీయ అతిపెద్ద బ్యాంకింగ్‌ రంగ సంస్థ ఎస్బీఐ తన వినియోగదారులకు షాక్‌ ఇచ్చింది. ఎస్బీఐ రుణ రేట్లు పెంచుతున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలని భావించే వారికి వడ్డీ రేట్ల పెంపు వర్తించనుంది. అంతేకాకుండా ఇప్పటికే లోన్ తీసుకొని ఉన్నా కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఎందుకంటే రుణ రేట్లు పెరగడం వల్ల ఈఎంఐ భారం కూడా పైకి చేరుతుంది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేటు (ఎంసీఎల్ఆర్)ను 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ఎస్బీఐ. జూలై 15 నుంచి ఈ కొత్త రుణ రేట్లు అమలులోకి వస్తాయని ఎస్బీఐ వెల్లడించింది.

అలాగే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్‌తో అనుసంధానం అయిన లెండింగ్ రేట్లను బ్యాంక్ మార్చలేదని, స్థిరంగానే కొనసాగించింది ఎస్బీఐ. అంటే ఇప్పుడు ఎంసీఎల్ఆర్ రేటు ప్రాతిపదికన లోన్ తీసుకున్న వారిపై ప్రభావం పడుతుంది. ఎస్బీఐ తాజా రేట్ల పెంపు తర్వాత చూస్తే.. ఏడాది ఎంసీఎల్ఆర్ రేటు 7.5 శాతానికి చేరింది. ప్రస్తుతం ఈ రేటు
7.4 శాతంగా ఉంది. ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్, నెల రోజుల ఎంసీఎల్ఆర్, మూడు నెలల ఎంసీఎల్ఆర్ అనేవి 7.05 శాతం నుంచి 7.15 శాతానికి పెరిగాయి. ఆరు నెలల ఎంసీఎల్ఆర్ అయితే 7.35 శాతం నుంచి 7.45 శాతానికి ఎగసింది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ రూ. 7.7 శాతానికి చేరింది. ఇక మూడేళ్ల ఎంసీఎల్ఆర్ రేటు 7.8 శాతానికి పెరిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version