ట్యాక్స్ కడుతున్నారా..? అయితే ఈ స్కీమ్ గురించి చూడాల్సిందే..!

-

చాలా మంది ట్యాక్స్ విషయంలో జాగ్రత్తగా వుంటారు. ఎక్కువ ట్యాక్స్ కట్టక్కర్లేకుండా చూస్తూ వుంటారు. పైగా పన్ను ఆదా చెయ్యడానికి సేవింగ్స్ స్కీమ్స్‌లో చేరతారు. అలానే ఇన్స్యూరెన్స్ ని కూడా తీసుకుంటూ వుంటారు. ఇది ఇలా ఉంటే ఎస్బీఐ ఎన్నో రకాల స్కీమ్స్ ని ఇస్తోంది.

అయితే ఇందులో ఎస్‌బీఐ ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్స్ కూడా ఒకటి. ట్యాక్స్ ని ఆదా చేసుకోవడానికి ఈ అకౌంట్ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో డబ్బులు డిపాజిట్ చేసి ఆదాయపు పన్ను చట్టం-1961 లోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. ఎస్‌బీఐ ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్ స్కీమ్‌ లో ఏడాదికి రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు డిపాజిట్ చెయ్యడానికి అవుతుంది.

గరిష్టంగా 10 ఏళ్ల వరకు డిపాజిట్ చెయ్యచ్చు. ఈ స్కీమ్‌కు టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లే వర్తిస్తాయి. ఇది ఇలా ఉంటే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు టర్మ్ డిపాజిట్లకు ప్రస్తుతం 5.5 శాతం వడ్డీ వస్తోంది. ఇదే వడ్డీ ఎస్‌బీఐ ట్యాక్స్ సేవింగ్ టర్మ్ డిపాజిట్ హోల్డర్లకు లభిస్తుంది. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల లాకిన్ ఉంటుంది. ఆ తరవాతే డబ్బులను విత్ డ్రా చెయ్యడానికి అవుతుంది.

ఒకవేళ డిపాజిట్‌దారు మరణిస్తే నామినీ డబ్బులు డ్రా చేసుకోవచ్చు. పైగా దీనిలో నామినేషన్ సదుపాయం కూడా వుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. టీడీఎస్ వర్తిస్తుంది. లోన్ సదుపాయం లేదు.

డిపాజిట్ హోల్డర్లు ఫామ్ 15G/15H సబ్మిట్ చేసి మినహాయింపును పొందొచ్చు. సింగిల్‌గా లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కావాలంటే మైనర్ పేరు మీద కూడా తెరవచ్చు. సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లాంటి స్కీమ్స్ కూడా వున్నాయి. వీటిలో కూడా డబ్బులు పెట్టచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version