కరోనా నేపధ్యంలో ఎస్బీఐ కీలక నిర్ణయం…!

-

కరోనా వైరస్ మహమ్మారి అందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. అయితే దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కష్ట సమయం లో రిలీఫ్ ని ఇచ్చే వార్తని ఒకటి చెప్పడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

కోవిడ్ 19 రోగులు ఎక్కువ అయి పోవడం తో కోవిడ్ రోగుల కోసం ఐసీయూ ఫెసిలిటీ తో హాస్పిటల్ కడుతున్నామని ఎస్‌బీఐ వెల్లడించింది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండడం తో ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ హాస్పిటల్స్ నిర్మిస్తామని బ్యాంక్ పేర్కొంది.

దీని కోసం తొలి దశలో రూ.30 కోట్లు కేటాయించామని చెప్పింది స్టేట్ బ్యాంక్. మేక్‌షిఫ్ట్స్ హాస్పిటల్స్ లేదా తాత్కాలిక కోవిడ్ హాస్పిటల్స్ కోసం బ్యాంక్ రూ.70 కోట్లు కేటాయించింది. ఇది ఇలా ఉంటే కరోనా రోగులకు వైద్య సేవలు అందించడానికి ఎమర్జెన్సీ బేసిస్ మీద హాస్పిటల్ నిర్మాణానికి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ NGOs, హాస్పిటల్ మేనేజ్‌మెంట్లతో కూడా చర్చిస్తున్నట్టు బ్యాంక్ అంది.

తీవ్రత ఎక్కువగా రాష్ట్రాల్లో 1000 బెడ్లు, 50 ఐసీయూ ఫెసిలిటీతో హాస్పిటల్స్ నిర్మాణం స్టార్ట్ చేస్తామని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో 120, 150 బెడ్స్‌ ఉంటాయని, హాస్పిటల్స్ సామర్థ్యం ప్రాతిపదికన బెడ్స్ సంఖ్య మారుతుందని వివరించారు. ఆ తరువాత క్రమంగా పెంచుతామని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version