ఆ స్థానాల్లో కారు-కాంగ్రెస్ మధ్యే పోటీ..కమలం థర్డ్ ప్లేస్?

-

తెలంగాణలో ప్రస్తుతం అధికార బి‌ఆర్‌ఎస్-బి‌జే‌పిల మధ్య రాజకీయ యుద్ధం తీవ్ర స్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని బి‌ఆర్‌ఎస్ చూస్తుంటే..బి‌ఆర్‌ఎస్‌కు చెక్ పెట్టి అధికారం దక్కించుకోవాలని బి‌జే‌పి చూస్తుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం చూస్తే బి‌ఆర్‌ఎస్ ఫస్ట్ ప్లేస్ లో, బి‌జే‌పి సెకండ్ ప్లేస్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీ రేసులో లేనట్లు రాజకీయం నడుస్తోంది.

కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. రాజకీయం ఎలా జరిగినా..మొదట బి‌ఆర్‌ఎస్ ఉన్నా,. రెండోస్థానంలో కాంగ్రెస్ ఉందని, మూడో స్థానంలో బి‌జే‌పి ఉందని అంటున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే బి‌జే‌పికి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు గాని,నేతలు గాని లేరు. అందుకే బి‌జే‌పి..కాంగ్రెస్ నేతలని లాగి సీట్లు ఇవ్వాలని చూస్తుంది. ఆల్రెడీ ఈటల రాజేందర్ అదే పనిలో ఉన్నారు. బి‌జే‌పి వీక్ గా ఉన్న స్థానాల్లో బలమైన కాంగ్రెస్ నాయకులని పార్టీలోకి తీసుకొచ్చి సీట్లు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ అది అంతగా వర్కౌట్ అయ్యేలా లేదు.

ఆ విషయం పక్కన పెడితే..119 స్థానాలు ఉంటే అందులో మెజారిటీ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్యే పోరు నడిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. అందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో ఈ రెండు పార్టీల మధ్యే వార్ నడుస్తుందని తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీలు పోటాపోటిగా ఎస్సీ, ఎస్టీ స్థానాలని గెలుచుకున్నాయి. మొత్తం 9 ఎస్టీ స్థానాలు ఉంటే అందులో కాంగ్రెస్ 7 స్థానాలు గెలిస్తే..బి‌ఆర్‌ఎస్ 2 స్థానాలు గెలిచింది.

అయితే తర్వాత కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలని బి‌ఆర్‌ఎస్ లాగేసుకుంది. అయినా సరే ఆ స్థానాల్లో కాంగ్రెస్ బలంగానే ఉంది. ఇక ఎస్సీ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్ పైచేయి సాధించింది. కానీ ఆ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టు ఉంది. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో బి‌జే‌పికి పెద్ద బలం లేదు..ఈ స్థానాల్లో బి‌ఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్యే వార్ నడవనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version