మీరు 7వ తరగతి ప్యాస్ అయ్యారా..? అయితే మీకు గుడ్ న్యూస్. 7వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వాళ్లకి నేషనల్ ఇన్‌కమ్ అండ్ మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్ స్కాలర్‌షిప్ పొందే అవకాశం వుంది. ఇక మరి పూర్తి వివరాల లోకి వెళితే… నెలకు 1000 రూపాయల స్కాలర్‌షిప్ ని అర్హత కలిగిన వాళ్లకి ఇవ్వనున్నారు. అయితే దీని కోసం అర్హత పరీక్షను నిర్వహిస్తారు.
ఆసక్తి వున్న వాళ్లు అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 24 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చు. ఒకవేళ అర్హత పొందితే నేషనల్ ఇన్‌కమ్ అండ్ మెరిట్ బేస్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్ స్కాలర్ షిప్ ని పొందొచ్చు. ఈ పరీక్ష నవంబర్ 6న జిల్లా స్థాయి లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు జరుగుతుంది.
7వ తరగతి పరీక్షలో ప్యాస్ అయిన వారే దీనికి అర్హులు. అలానే ఈ పరీక్షకి దరఖాస్తు చేసుకోవాలంటే విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయం 350000.00 మించకుండా ఉండాలి. అదే విధంగా జవహర్ నవోదయ విద్యాలయం, కేంద్రీయ విద్యాలయం, సైనిక్ స్కూల్, ప్రభుత్వ రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు దీనికి అర్హులు కాదు. రిజర్వేషన్ సర్టిఫికేట్ ని రిజర్వేషన్ క్యాటగిరీలు వాళ్ళు అప్ లోడ్ చెయ్యాల్సి వుంది. www.entdata.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.