తెలంగాణలో స్కాలర్షిప్ పొందే విద్యార్థులకు కేసీఆర్ సర్కార్ శుభవార్త చెప్పింది. పదో తరగతి , ఇంటర్ , మరియు ఇంజనీరింగ్ సహా 17 రకాల కోర్సులలో 2021-22 లో ఉత్తీర్ణులైన కార్మికుల పిల్లలకు ప్రతిభా ఆధారంగా ఉపకార వేతనాలకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి దరఖాస్తులను ఆహ్వానించింది.
దరకాస్తు ఫారాలను సంబంధిత సహాయ కమిషనర్ కార్యాలయంలో పొందవచ్చునని, పూర్తి చేసిన దరఖాస్తులను ఫిబ్రవరి 15 లోపు సమర్పించాలని సూచనలు చేసింది సర్కార్. దుకాణాలు, ధర్మాగారాలు మరియు వాణిజ్య సంస్థలు చేస్తున్న కార్మికుల పిల్లలు అర్హులని తెలిపింది. వారి తరగతి, కోర్సులో మార్కుల శాతం ఆధారంగా స్కాలర్షిప్ లకు ఎంపిక అవుతారని స్పష్టం చేసింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని పేర్కొంది.