దేశ రాజధాని న్యూఢిల్లీ మళ్లీ ఆంక్షల చట్రంలోకి వెళ్లింది. కరోనా కేసులు పెరుగుతుండటం, ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించింది. మంగళవారం ఎల్లో అలర్ట్‌ను అమలులోకి తీసుకు వచ్చింది. మధ్యాహ్నం 3గంటలకు ఎల్లో అలర్ట్‌పై ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు వెంటనే అమలులోకి వచ్చినట్లు ప్రకటించింది.
– నైట్ కర్ఫ్యూ ప్రతి నిత్యం రాత్రి 10గంటల నుంచి 5గంటల వరకు అమలులో ఉంటుంది.
– ప్రైవేట్ కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతో నిర్వహించాలి.
– హాస్పిటళ్లు, మీడియా, బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు తదితర అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు.
– సరిబేసి సంఖ్య విధానంలో మాల్స్, షాపులను తెరవాల్సి ఉంటుంది.
– వివాహాలకు కేవలం 20మందిని మాత్రమే అనుమతిస్తారు. ఇండ్లలో మాత్రమే వివాహాలను జరుపుకోవాల్సి ఉంటుంది.
– అంత్యక్రియలకు కూడా 20 మందినే అనుమతించనున్నారు.
– గృహ సముదాయాలు, కాలనీల్లోని దుకాణదారులు సరిబేసి సంఖ్యను ఫాలో కావాల్సిన అవసరం లేదు.
– సినిమాలు, మల్టీఫ్లెక్స్‌లు, జిమ్‌లు మూసివేసి ఉంటాయి. పాఠశాలలు, కళాశాలలు కూడా తెరుచుకోవు.
– రెస్టారెంట్లు, బార్లను రాత్రి 10గంటలకు మూసివేయాల్సి ఉంటుంది. మిగతా వేళల్లో 50శాతం కెపాసిటీతో నడిపించాల్సి ఉంటుంది.
– 50శాతం కెపాసిటీతో ఢిల్లీ మెట్రో రైల్ నడవనున్నది.